OTT Content Censor చేయాలా? చేయొచ్చా? – Mana Updates

OTT Content Censor చేయాలా? చేయొచ్చా?

Happy గా సెన్సార్ చేయొచ్చు, మన ఫోన్స్ లో కూడా “సెన్సార్ సేతు” అని ఒక app వేస్తే మనం మాట్లాడే బూతులు బూతు చేష్టలు కూడా సెన్సార్ చేయొచ్చు, ఆలోచనలు చేయలేమేమో. Vpn ద్వారా కూడా tiktok రాకుండా చేసిన ప్రభుత్వం porn మాత్రం ఆపలేకపోతోంది, లేక ఆపే ఉద్దేశం లేదో ? public థియేటర్స్ లో ఇళ్లలో కుటుంబ సమేతంగా చూస్తారేమో అనే ఆలోచనతో సెన్సార్ చేయడమో లేక సెల్ఫ్ సెన్సార్ అని guidelines పెట్టడంలో అర్థముంది కానీ చేతిలో మొబైల్ తోనో పర్సనల్ గా laptop లో చూసుకునే కంటెంట్ ని సెన్సార్ చేయాలనే ఆలోచన మాత్రం meaningless & senseless. “Adult content” అనేది సమస్యా ? అదేం కొత్తది కాదే, మన పురాణాలు సాహిత్యం వారపత్రికల్లో ఎప్పట్నుంచో ఉన్నదే. ఇంతకుముందు ఒక ఆర్టికల్ లో రాసాను మాకు తొమ్మిదో తరగతిలో తెలుగు పద్యభాగంలో పార్వతి తపస్సు అని శ్రీనాథుడు రాసిన పద్యం అనుకుంటా, నేను ఇప్పటికీ మర్చిపోలేకపోవటానికి కారణం మా తెలుగు మాస్టారు ప్రతి లైన్ ని విపులీకరించి వర్ణించటం, అందులో పార్వతి ఒంటిపైనుంచి నీరు ఎలా ఆమె అంగాంగాన్ని తడుముకుంటూ వెళ్తుందో వర్ణన ఉంటుంది, 14ఏళ్ళ వయసులో ఎటువంటి సెక్సువల్ ఆలోచనలు కలిగించిందో చెప్పలేను. స్వాతిలో సరసమైన కథలు, ఆంధ్రభూమిలో పెద్దలకు మాత్రమే, సెక్స్ నవలలు, మదవతి లాంటి పచ్చి బూతుపుస్తకాలు, ఇవన్నీ ఎప్పట్నించి ఉన్నాయి ? అంతెందుకు మన భారతీయ సినిమాల్లో b&w రోజులనుంచి ఇప్పటిదాకా హీరోయిన్ల exposing నుంచి item numbers పేరుతో జరిగినవి ఏంటి? ఫామిలీస్ పిల్లలతో కలిసి చూసే సినిమాల్లో ఎంత హింస ఉంటుంది, మళ్ళీ ఇవి సెన్సార్ అయి బయటకి వస్తున్నసినిమాలు. 
OTT కంటెంట్ చూసి ప్రభావితమై ఎవరు చెడిపోతారు ? పిల్లలా ? ఇవ్వాళ టీనేజ్ పిల్లల్ని online content కి దూరంగా ఉంచగలిగే శక్తి ఎవరికైనా ఉందా ? వాళ్ళేం చూస్తున్నారో ఎవరైనా మానిటర్ చేయగలరా ? అసాధ్యం, వాళ్ళని educate చేసి ఆపగలరేమో గానీ ban చేసి సెన్సార్ చేసి ఏదీ ఆపలేరు. పిల్లలు డ్రగ్స్ కి అలవాటు పడుతుంటే కనిపెట్టలేని తల్లితండ్రులు, వాళ్ళు పూర్తిగా addicts అయేవరకు తెలుసుకోలేని పోలీసులు, ఎక్కడున్నాం మనం ? 
పోనీ OTT తో ప్రాబ్లెమ్ సెన్సార్ అవని బూతులా? అసలు బూతులతో సమస్య ఏంటో ? 18+ కంటెంట్ అని mention చేసి ఉంటుంది అంటే అర్ధం ఏంటి ? ఆ వయసు దాటిన వాళ్ళు వివేకంతో విచక్షణతో నిర్ణయించుకోవచ్చు, చూడటం మొదలుపెట్టినాక అది నిన్ను అసౌకర్యానికి గురి చేస్తోంది అంటే చూడటం ఆపేయ్, ఆ మాత్రం నిర్ణయం తీసుకోలేరా ? 
ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శించే కంటెంట్ ఉండటం ప్రధాన కారణం కావచ్చు, మన దేశమనే కాదు ఇతర దేశాల్లో కూడా దేశాధినేతలు వ్యతిరేకతని తట్టుకోలేకపోతున్నారు అణచివేయడం ఒక్కటే మార్గం, అది ఎలాగైనా కావచ్చు. అసలు OTT కంటెంట్ ని ఎలా సెన్సార్ చేస్తారు ? సినిమాలకి అంటే సెన్సార్ బోర్డు అక్కడ కొంతమంది పనిలేని పాలకవర్గ బానిసలు ఉంటారు వాళ్ళు కొన్ని సినిమాలు చూసి సెన్సార్ చేయగలరు, కానీ కొన్ని వేలగంటల కంటెంట్ ని సెన్సార్ చేయటం administrative పరంగా సాధ్యమేనా ? లేక సెల్ఫ్ సెన్సార్ చేసుకోమంటారా ? 
-Article by camp sasi
Website: click here 
Telegram channel: click 

for more Updates do subscribe to the newsletter and also subscribe in youtube: Click here

Till then keep visiting our website 
Telegram channel: Join Here
Instagram: Click here 
Join in Facebook group: Click here
Like our page on Facebook: Click here
Subscribe our Youtube Channel: Click here

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *