ముంబై నార్త్ జోన్ డీసీపీ:-
అంబికా 14 సంవత్సరాల వయసులో తమిళనాడులో ఒక కానిస్టేబుల్ ని వివాహం చేసుకుంది. ఈమె కూడా బాల్య వివాహానికి బలైన వ్యక్తే కానీ ఏనాడు వ్యవస్థ మీద అసహ్యం పెంచుకోలే. ఆమెకు 18 సంవత్సరాలు నిండే సరికి ఇద్దరి ఆడపిల్లల తల్లి.
అంబికా భర్త పోలీస్ IG మరియు DIG పరేడ్ కోసమని ఒక రోజు పొద్దున్నే లేచి వెల్లిపోయాడు. ఆమెకి IG మరియు DIG లకు అధికార లాంచనాలు ఎలావుంటాయో తెలుసుకోవాలని ఆశ కలిగింది. భర్త ఇంటికి తిరిగొచ్చినక వాళ్ళ గురించి అడుగితే వాళ్ళు చాలా పెద్ద వాళ్ళు రాష్ట్రా పోలీసు దేపర్ట్మెంట్లనే పెద్దవాళ్ళు అని చెప్పేసరికి, నేను కూడా ఆ పదవిలో ఉంటే బాగుండు అని ఆశపడ్డది.
అంబికా చిన్నప్పుడే పెళ్ళి చేసుకుంది కాబట్టి SSLC కూడా పాస్ కాలేదు కానీ ఆ పదవిని ఎంత కష్టం అయినా సాదించాలనుకుంది. ఆ విషయం తన భర్తకి చెప్పింది, భర్త కూడ సరే నేను సహకరిస్తాను కానీ ముందు నువు SSLC పాస్ కా అన్నాడు.svp
కష్టపడి నిద్ర హారాలు మాని అటు పిల్లలకి ఇటు భర్తకి సేవ చేస్తూ SSLC, PUC, డిగ్రీ పాస్ అయ్యింది. భర్తని బ్రతిమిలాడి ఒప్పిచ్చి చెన్నైలో IPS కోచింగ్ చేయడానికి భర్త ఏర్పాట్లు చేసాడు. భర్త అన్ని వేళలా తాను ఎదికావలన్న సమకూర్చేవాడు, అలా భర్త సహకారంతో కష్టపడి కోచింగ్ పూర్తిచేసింది.
3 సార్లు పరీక్ష రాసినకాని పాస్ కాలేదు. భర్త కూడా బలవంతంగా ఇంటికి వచ్చేయి గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు కొన్ని రోజులే ఉంది అన్నాడు. కానీ అంబికా ఇంకా ఒక్క ప్రయత్నం చేస్తాను అప్పుడు కూడా రాకపోతే వచేస్తాను అన్నది,svpదానికి అతను సరే అన్నాడు. ఒకవేలా పాస్ కాకపొతే కనీసం టీచర్ ఉద్యోగం అయిన చేయొచ్చు అనుకున్నది.
మళ్ళీ కష్టపడి చదివి పరీక్ష రాసి నాలుగోసారికి అన్ని టెస్టులు ఒకటేసారి పాస్ అయ్యింది. 2008 పాస్ అయినక ఆమెకి గవర్నమెంట్ ట్రైనింగ్ కి పంపింది. ఇప్పుడామె ముంబై నార్త్ జోన్ డీసీపీ గా పనిచేస్తున్నారు.
అంబికా ని చూసి మనం చాలా నేర్చుకోవాలి. ఆమె వవ్యస్తని కానీ, బాల్య వివాహం చేసినందుకు తల్లి తండ్రులను బాద్యులను చేయలేదు. ఒకటి సాధించాలి అని సంకల్పంతో భర్త సహాయంతో ముందుకు పోయి డీసీపీ అయ్యింది.
Website: click here
Telegram channel: click
for more Updates do subscribe to the newsletter and also subscribe in youtube: Click here
Till then keep visiting our website
Telegram channel: Join Here
Instagram: Click here
Join in Facebook group: Click here
Like our page on Facebook: Click here
Subscribe our Youtube Channel: Click here
Related
In this article:

Click to comment