అనసూయ ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండనడంలో సందేహ అక్కర్లేదు. టీవీ షో యాంకర్‌గా మంచి పేరు సంపాధించింది. అయితే…తాజాగా అనసూయపై ఓ వార్త వైరల్ అయింది.
విజయ్ సేతుపతి హీరోగా చేస్తున్న సినిమాలో అనుసూయ నటిస్తుందని.. అందులో సిల్క్ స్మితా పాత్ర చేస్తుందని వార్తలు వచ్చాయి. అయితే…. దీనిపై స్వయంగా అనసూయ ట్విట్టర్ వేదికగా స్పందించింది. తాను సిల్క్ స్మితా పాత్ర చేయడం లేదని క్లారిటీ ఇచ్చేసింది. ఆ వార్తలన్నీ జస్ట్ రూమర్స్ అని తేల్చేసింది అనసూయ.
అంతే కాకుండా తనదైన నటనతో సినీ రంగంలోనూ పేరు సంపాధించింది. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన రంగస్థలం సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. అంతే రేంజ్లో రంగమ్మత్తగా అనసూయ కూడా పేరు తెచ్చుకుంది. అంతకు ముందు కొన్ని సినిమాలతో మంచి పేరు ఉన్నా ఈ సినిమాతో ఓ స్థాయికి చేరుకుంది. ఇదిలా ఉంటే ఆమె నటించిన థాంక్యూ, బ్రదర్ సినిమాలు ఇంకా విడుదల కావాల్సి ఉంది. అంతేకాకుండా కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కనున్న రంగ మార్తాండ, రవితేజ తరువాతి సినిమా ఖిలాడీలో కీలక పాత్రలో కనిపించనుంది.