మెగస్టార్ చిరంజీవి నిహారికపై ఓ ఎమోషనల్:-
మెగా డాటర్ నిహారిక మరి కొన్ని గంటల్లోనే పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. గుంటూరు
రేంజ్ ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్ రావు కుమారుడు వెంకట చైతన్యతో డిసెంబర్ 9న నిహారిక వివాహం జరగనుంది. ఈ వేడుక రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా ఐదు రోజుల పాటు గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలోనే మెగా మరియు అల్లు ఫ్యామిలీలు ఉదయ్‌పూర్ ప్యాలెస్‌కు చేరుకున్నారు. అయితే తాజాగా మెగస్టార్ చిరంజీవి నిహారికపై ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. `మా చేతిలో పెరిగిన మా చిన్నారి నిహారికని, చైతన్య చేతిలో పెడుతున్న ఈ శుభతరుణంలో, ముందస్తుగా, కాబోయే దంపతులకు నా శుభాకాంక్షలు, ఆశీస్సులు` అని చిరు పేర్కొన్నారు.
అంతేకాదు, నిహారికను చిన్నప్పుడు చిరు ఎత్తుకున్న ఫొటో మరియు ప్రస్తుతం పెళ్లి సందర్భంగా దిగిన ఫొటోను జత చేసి పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో తెగ వైరల్ అవుతోంది. ఇక పెళ్లికి ఒకరోజు మాత్రమే సమయం ఉండడంతో.. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సందడి షురూ చేశారు.
Website: click here
Telegram channel: click
for more Updates do subscribe to the newsletter and also subscribe in youtube: Click here
Till then keep visiting our website
Telegram channel: Join Here
Instagram: Click here
Join in Facebook group: Click here
Like our page on Facebook: Click here
Subscribe our Youtube Channel: Click here