Quote1:
పదే పదే నీ తలపుల తమకం
నను తరుముతుంటే…
కరుణించని కాలానికి బానిసనై
నే పయనిస్తున్నా…
మరుపు రాని జ్ఞాపకాల చిచ్చు
మదిలో రగిల్చిన…
గతం తాలూకు తీపి గుర్తులు
ఇంకా మిగిలేఉన్నాయ్…❤️❤️
Quote 2:
నీ తలపు అక్షరాల పూదోటలో
రెక్కలు తొడిగిన సీతాకోకనై నే
విహరిస్తున్నా…
ఊసుల ముడి వేసిన…ఏకాంతపు
క్షణాలన్నీ ఆర్తిగా నను
పలకరిస్తుంటే…
ఊహల పుస్తకాన్ని తెరిచి…నీ
జ్ఞాపకాల చెంత కాలాన్ని…గడిపేస్తున్న
బంగారం…❤️❤️
Quote 3:
కళ్ళతో మోసుకొచ్చిన జ్ఞాపకాల
దొంతరలు…
రహస్యంగా చీకటిరేయి తో చెలిమి
చేసాయేమో!!!
ఊరించే కలల నదిలా మారి
పరువపు సెలయేరులా విరహాల
లోకానికి నిన్ను…
నన్ను పరిచయం చేసింది❤️❤️
Quote 4:
నీ ఆలోచనల పారవశ్యం అనుక్షణం
నను ముంచేస్తుంటే…
మది సంద్రంలో ఏవేవో తెలియని
అలజడులు సడి రేపుతుంటే…
ఒక్కో తలపు ఎగసిపడే కెరటమై
వచ్చి ఎదను తాకుతుంటే…
ఆ క్షణంలో నీ జ్ఞాపకాల అలలు మదిని
చేరగానే తీరం తాకిన అలలా…
స్తబ్దత మరిచిన మది…నెమ్మదిగా
నీ ఊహల జడిలో ఐక్యమయినది…❤️❤️
Quote 5:
మనసేందుకో కలవరపడుతోంది బహుశా…
నీ ఊహలతో సావాసం చేయాలని కాబోలు❤️❤️
కవి
©Kavita Raghav
Website: click here
Telegram channel: click
for more Updates do subscribe to the newsletter and also subscribe in youtube: Click here
Till then keep visiting our website
Telegram channel: Join Here
Instagram: Click here
Join in Facebook group: Click here
Like our page on Facebook: Click here
Subscribe our Youtube Channel: Click here
Advertisement. Scroll to continue reading.
Related
In this article:

Click to comment