మనకి ఆ రకంగా డిజిటల్ సంచలనం సృష్టించిన సినిమా అది కూడా 5D మీద తీసిన సినిమానే – Mana Movie Updates

Frances Ha (2013)
ఈ సినిమా గురించి చెప్తూ రోహిత్ “5D Mark 2 మీద తీసారు” అన్నాడు, అది నాకు interesting గా అనిపించింది. French New Wave look achieve చేయడానికి ఆ కెమెరా అనుకోవడానికి ఒక కారణమైతే ఇంకొకటి రోడ్ల మీద తీయాలి, బడ్జెట్ లేదు, Newyork Paris లో షూట్ చేయాలి అందుకే చిన్న crew చిన్న కెమెరా. HD quality లోనే తీసారు, ఇదెందుకు రాస్తున్న అంటే, ఏ కెమెరాతో షూట్ చేయాలి అనేది ఒక పెద్ద ప్రశ్న మనకి ఇప్పటికీ, పెద్ద కెమెరాలతో తీస్తేనే సినిమా , even webseries ల కి కూడా అదే. శీష్ మహల్ తీసింది 5D mark 3 మీద, same ఐడియా బడ్జెట్ లేదు, రోడ్ల మీద తీయాలి. ఇది బిగ్ స్క్రీన్ మీద ప్రాజెక్ట్ చేస్తే బాగా టెక్నికల్ గా తెలిసినవాడు చెప్పగలుగుతాడేమో కానీ మామూలు ప్రేక్షకులకి అసలు డిఫరెన్స్ తెలియదు. మేము తీసేవన్నీ చిన్న కెమెరాల తోనే, ఎందుకంటే మా స్టైల్ కి విపరీతమైన comfort ఉంటుంది. మేమనే కాదు చాలా మంది తీస్తుంటారు, నేను మొన్న లైవ్ లో చెప్పినట్టు Marriage videographers దగ్గర ఉండే equipment తో సినిమా తీసేయొచ్చు. ఈ Frances Ha అనే సినిమా prime video లో ఉంది కానీ ఇండియాలో available లేదు, తప్పదు torrent చేయాల్సిందే. సినిమా తీసాక ఫస్ట్ 9 నెలలు ఫెస్టివల్స్ లో participate చేసి తర్వాత అమెరికాలో చాలా లిమిటెడ్ గా రిలీజ్ అయింది, festivals & ఆడియన్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. 
మనకి ఆ రకంగా డిజిటల్ సంచలనం సృష్టించిన సినిమా “ఈ రోజుల్లో”, అది కూడా 5D మీద తీసిన సినిమానే, ఆ తర్వాత విచ్చలవిడిగా 5D సినిమాలు వచ్చాయి, ఏ లెవెల్లో అంటే ఒక టైంలో ఇండస్ట్రీ ఇలా తీసేవాటిని సినిమాలుగా consider చేయకూడదు, సెన్సార్ అవదు అనేంతగా. ఇది ప్రపంచ సినిమాలో ఎప్పుడూ జరిగేదే, కెమెరా చిన్నదైన ప్రతిసారి విపరీతంగా సినిమా ప్రొడ్యూస్ అవుతుంది, దాంట్లో చాలా చెత్త సినిమా ఉండొచ్చు కానీ కొన్ని సినిమాలు ఇండస్ట్రీ కి ఏదో ఒక రకంగా contribute చేస్తాయి. 
ప్రస్తుతం web series లు కూడా పెద్ద కెమెరాలతో లైటింగ్ సెటప్ లతో తీస్తేనే క్వాలిటీ ప్రోడక్ట్ కింద పరిగణిస్తున్నారు, ఇది ఒకరకమైన అడ్డంకే, మొబైల్స్ కే కాదు 4k టీవిలో చూసిన Sony A7s లాంటి కెమెరాలతో తీసిన క్వాలిటీ చాలా బాగుంటుంది. కొన్ని సినిమాలు పెద్ద కెమెరా సెటప్ లో చేయలేం, అలాగని చిన్న కెమెరాలతో చేస్తే అమ్ముకోవడానికి చాలా కష్టపడాలి. ఏ రకంగా ఈ క్వాలిటీ judge చేస్తారో OTTs లో నాకు కూడా తెలియదు. May be మనం తీసే కంటెంట్ అంత path breaking గా ఉంటే అప్పుడు అమ్మొచ్చేమో, అలాంటివి అనుకుని తీయలేమని నా ఫీలింగ్, it just happens.
– Camp Sasi ( Director) 

Leave a Reply

Your email address will not be published.

AllEscort