బీచ్‌లో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకోవాలనుకుంటున్నట్లు రకుల్ ప్రీత్ సింగ్ చెప్పింది – Rakul Preeth Singh About Her Marrige

టాలీవుడ్ లో పెళ్లిళ్ల కాలం నడుస్తోంది. కరోనా టైమ్ లో నిఖిల్, నితిని, రానా ఓ ఇంటివాళ్లు అయ్యారు. మెగా హీరోయిన్ నిహారిక ఓ ఇల్లాళ్లయింది. జొన్నలగడ్ద చైతన్యని పెళ్లాడింది. 

ఈ లిస్టులో ముందు వరసలో అనుష్క, తమన్నా ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో రకుల్ ప్రీత్ సింగ్, రాశీఖన్నా తదితరులున్నాయి.

ఇక చాన్నాళ్ల నుంచి పెళ్లి కోసం పరితపించిన స్టార్ హీరోయిన్ కాజల్ కరోనా టైమ్ లోనే పెళ్లి చేసుకుంది. ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుని పెళ్లాడింది.

ప్రస్తుతం హానీమూన్ ఎంజాయ్ చేస్తోంది. కాజల్ పెళ్లితో మిగితా ముద్దురు ముద్దుగుమ్మల పెళ్లి మరోసారి చర్చనీయాంశం అయింది. 

తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ కాబోయేవాడి గురించి చెప్పింది. అలాగని పెళ్లి కబరు చెప్పలేదు. కానీ కాబోయేవాడు ఎలా ఉండాలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. తనకు కాబోయే భర్త ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తే సంతోషిస్తా. తాను తన కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలోనే తన పెళ్లి జరగాలని ఆశిస్తున్నానని చెప్పింది. తాను బీచ్‌లో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకోవాలనుకుంటున్నట్లు తెలిపింది. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం రకుల్ క్రిష్ సినిమాలో నటిస్తోంది. ఇందులో వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.

AllEscort