అవినాష్ : ఏడుగురు కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు వాళ్లలో ఎవరో ఒకరు వీక్ ఉంటారు. ఆ డిస్కషన్స్‌లో టాస్క్‌ల పరంగా ఎంటర్ టైన్మెంట్ పరంగా నేను స్ట్రాంగ్ అని అనిపించింది. మోనాల్ వీక్ అని అనిపించింది. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి మేం గేమ్‌ని సీరియస్‌గా ఆడుతుంటే.. ఆమె లాస్ట్‌లో బాగా ఆడుతున్నా అంటే కరెక్ట్ కదా. ఇప్పుడు బాగా ఆడుతున్నా అంటే అంతకు ముందు ఆడనట్టే కదే..
కెప్టెన్సీ టాస్క్ అప్పుడూ కూడా ఎఫర్ట్ పెట్టలేదని తనే చెప్పింది.అఖిల్ లాంటి పర్సన్స్ అడిగినప్పుడు మిస్టేక్స్ యాక్సెప్ట్ చేస్తుంది. నాలాంటి వాళ్లు అడిగితే తన తప్పు ఒప్పుకోదు. వాదిస్తూ ఉంటుంది. నేనే కాదు.. బయట కూడా అనుకునే టాక్ ఏంటంటే.. మోనాల్ వీక్ అంటే గేమ్ వరకే. నేను మోనాల్ నామినేషన్స్‌లో ఉన్నాం అంటే.. ఎవరైనా మోనాల్ ఎలిమినేట్ అవుతుందని అనుకుంటారు తప్పితే అవినాష్ ఎలిమినేట్ అవుతాడని అనుకోరు హౌస్‌లో మిగిలిన ఆరుగురికి కూడా తెలుసు.. నేను ఎలా ఆడతానో.. మోనాల్ గేమ్ ఎలా ఆడుతుందో.. ఈ సడెన్ షాక్ నమ్మలేకపోతున్నా. అసలు ప్రేక్షకులు ఆమెకి ఓట్లేసి ఎలా గెలిపిస్తున్నారో అర్ధం కావట్లేదు అని అవినాష్ చెప్పాడు.