భారత ఫార్మా దిగ్గజం గ్లెన్మార్క్ కొత్త మందును ఆవిష్కరించినట్టు వెల్లడించింది. ఇప్పటికే మూడు దశల్లో క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపింది. ఒక ఫవిపిరావీర్ టాబ్లెట్ ధర సుమారు రూ.103 వరకు ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు పీటీఐ వార్త సంస్థ వెల్లడించింది.
కరోనాపై పోరులో మరో ముందడుగు పడింది. వైరస్ సోకిన రోగులకు చికిత్స కోసం ‘ఫవిపిరావీర్’ అనే ఔషధాన్ని ఆవిష్కరించింది ఫార్మాస్యూటికల్ సంస్థ గ్లెన్మార్క్. ఫాబిఫ్లూ బ్రాండ్ పేరుతో తెస్తున్న ఈ ఔషధం తేలికపాటి లేదా ఓ మోస్తరు స్థాయిలో కరోనాతో బాధపడుతున్న రోగులకు ఉపయోగపడుతుందని పేర్కొంది.
ఒక 200 ఎంజీ టాబ్లెట్ ధర సుమారు రూ.103 వరకు ఉంటుందని, 34 టాబ్లెట్లు ఉండే ఓ స్ట్రిప్… గరిష్ఠ రిటైల్ ధర రూ.3,500 వరకు ఉంటుందని గ్లెన్మార్క్ వెల్లడించింది.వైద్యుల సలహా తప్పనిసరిభారత్లో కరోనా రోగులు నోటి ద్వారా తీసుకునే ఔషధాల్లో అనుమతి పొందిన మొదటి డ్రగ్ ‘ఫాబిఫ్లూ’ అని గ్లెన్మార్క్ ప్రకటించింది. ఈ మందును వైద్యుల సలహాపై మాత్రమే వాడాలని సంస్థ స్పష్టం చేసింది.మొదటి రోజు 1,800 మి.గ్రా మోతాదులో రెండు సార్లు చొప్పున మొదలు పెట్టి… 14వ రోజునాటికి రోజుకు రెండు సార్లు 800 మి.గ్రా మోతాదుకు.. దీనిని తగ్గిస్తూ రావాలని పేర్కొంది. మధుమేహం, గుండె జబ్బులు ఉన్నవారు కూడా వీటిని వాడవచ్చని వెల్లడించింది.హిమాచల్ప్రదేశ్లోప్రస్తుతం ఈ టాబ్లెట్లను హిమాచర్ప్రదేశ్లో ఉత్పత్తి చేస్తున్నట్లు గ్లెన్మార్క్ తెలిపింది. ఆసుపత్రుల్లో, రిటైల్ దుకాణాల్లో ఈ ఔషధం లభిస్తుందని వెల్లడించింది. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి తయారీ, మార్కెటింగ్ అనుమతి పొందినట్లు ముంబయికి చెందిన ఈ సంస్థ పేర్కొంది.భారత్లో విపరీతంగా కొవిడ్ కేసులు, మరణాలు పెరిగిపోతున్న నేపథ్యంలో మహమ్మారి నివారణకు ఈ ఔషధం ఉపయోగపడుతుందని గ్లెన్మార్క్ ఆశాభావం వ్యక్తం చేసింది.
for more Updates do subscribe to the newsletter and also subscribe in youtube: Click here
Till then keep visiting our website
Telegram channel: Join Here
Instagram: Click here
Join in Facebook group: Click here
Like our page on Facebook: Click here
Subscribe our Youtube Channel: Click here
Related
In this article:

Click to comment