
నునువెచ్చని చూపుల కిరణాలతో చలి కాచుకోవాలని ఆరాటపడుతోంది… || Quotes Telugu
నీ చూపుల సెగ నను
తాకనందుకేమో!!!
ఈ చలి తాపం మరీ నన్ను
వణికిస్తోంది…
ఓ సారి నీ చూపుల గాలులు
ఇటుగా వీస్తే…ఆస్వాదించాలనే
తపనల వెల్లువలో…
ఆ నునువెచ్చని చూపుల
కిరణాలతో చలి కాచుకోవాలని
ఆరాటపడుతోంది…
కొన్ని సేద తీర్చే క్షణాలు
కొన్ని స్వేద గాంధాల వెల్లువలు
హాయిగా నా నగ్న పాదాలను
ముద్దాడుతూ…
చెరగని గురుతులు ఇవి
చెదరని స్మృతుల వాహిని లో నన్ను
నేను ఇంకాస్త అచేతనంగా
మార్చుకుంటూ…❤️❤️
© Kavitha Raghav