
గూఢచారి Movie Full Review by Balaji Prasad – Mana updates Review
గూఢచారి Movie Full Review❤
మై_వ్యు Only:-
‘పూర్తి ఐడెంటిటీనే మార్చుకొని అర్జున్ లా సర్ వైవల్ అవుతున్న గోపి. #రా ఏజెంట్ గా పని చేస్తూ ఒక ఆపరేషన్ లో చనిపోయిన తన తండ్రిలాగే తాను కూడా ‘రా’ లో వర్క్ చేయాలనీ ట్రై చేస్తుంటాడు.. కానీ గోపిని పెంచి పెద్దచేసిన రఘువీరా ఫ్రెండ్, మాజీ ‘రా’ ఏజెంట్ ఐన సత్యా దానికి ఒప్పుకోడు . సత్యకి తెలీకుండా గోపి ‘రా’ లో జాయిన్ అయ్యి ఏజెంట్ అవుతాడు. కానీ….తనకి తెలీకుండానే ఇండియన్ రా కి వాంటెడ్ లిస్ట్ లోకి చేరుతాడు ‘ఏజెంట్ గోపి…’ అసలు వాంటెడ్ లిస్ట్ లోకి ఎందుకు చేరుతాడు? అందులో నుండి ప్రాణాలతో ఎలా బయటపడ్డాడు? అనేది మిగతా కథ…’
విశ్లేషణ :
నాకుమొదటి నుండి స్క్రిప్ట్ నాలెడ్జ్ విషయంలో అడివి_శేషు పైన సదభిప్రాయం ఉంది. మన తెలుగులో ఉన్న ‘ది బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్స్’ లో అడివి శేషు ఉంటాడని నా ఫ్రెండ్స్ తో చెప్తూ ఉంటాను.. తన మొదటి సినిమాలు కర్మ,కిస్ స్క్రిప్ట్స్ కూడా నాకు బాగా ఇష్టం . ఆ తర్వాత క్షణం స్టోరీ టెల్లింగ్ విషయంలో నేను నమ్మింది నిజం ఐంది.. ఇప్పుడు మళ్ళీ ప్రూ ఐంది….
ఈ స్క్రిప్ట్ లో ఆరు ట్విస్ట్ లు, మూడు సస్పెక్టివ్ లేయర్స్ ఉన్నాయ్… అయినా ఎక్కడ కన్ఫ్యూజన్ ఉండదు, అంతే క్యూరాసిటీగా కూడా ఉంటుంది….
స్క్రీన్ ప్లే రివీలింగ్స్ అంత పకడ్బంధీగా ఉన్నాయి…
నటీనటులు
క్యారెక్టర్స్ కి తగ్గట్టుగా నటీనటుల ఎంపిక స్యూటబుల్ గా ఉన్నాయ్…. జగపతిబాబు క్యారెక్టర్ సర్ఫరైజింగ్ గా అనిపించింది…..అందరూ బాగా యాక్ట్ చేసారు… ‘అక్కడమ్మాయ్ ఇక్కడబ్బాయ్’ ఫేమ్ సుప్రియ మళ్ళీ ఒక మంచి పాత్రలో యాక్ట్ చేయడం విశేషం…
టెక్నీషియన్స్ :
సినిమాటోగ్రఫీ కూడా స్క్రిప్ట్ లో ఒక భాగం ఐపోయింది. మణికొండను కూడా ఇంత అందంగా చూపించొచ్చా అనిపించింది…స్పై సినిమా అనగానే వందకోట్లు పెట్టేసి గ్రాఫిక్స్ ,ఫ్లయిట్స్ ,ఫైట్స్ ఓ రేంజ్ లో చూపించాల్సిన అవసరం లేదు… ఐదు కోట్లతో కూడా అద్భుతంగా చూపించొచ్చు, మన ఇండియన్ స్పై ప్రాసెస్ ఇలానే ఉంటుంది.. అని సగటు ప్రేక్షకుడికి అర్థమయ్యేలా చూపించారు.
కిస్ మూవీ రివ్యూ రాసేప్పుడు కొరియన్ మూవీలా ఉంది అని చెప్పాను…ఆ మూవీ మొత్తం ఫారెన్ లో తీశారు కాబట్టి అలా ఉంది అన్నారు…మరి గూఢచారిలో చాలామటుకు హైదరాబాద్ లోనే ఉంది మరి హైదరాబాద్ లో కొరియన్ ఫ్రేమింగ్ ఎలా వచ్చింది ? ఆకాశం ఎక్కడైనా ఒకటే.. సినిమాటోగ్రాఫర్ కి టెక్నీకల్ నాలెడ్జ్ ఉంటె ఎక్కడైనా కొరియన్ ఫ్రేమింగ్ వస్తుంది….యాంగిల్, డీఐ , కలర్స్,లొకేషన్ ఎట్మాష్పియర్, ఎడిటింగ్ నాలెడ్జ్ ,ఇచ్చిన బడ్జెట్ లో క్వాలిటీగా ఎలా తీయాలి లాంటి అవగాహన ఉన్న కెమెరామెన్ ఉంటె మణికొండలో కూడా కొరియన్ ఫ్రేమింగ్ ఎందుకు రాదు…
ఇంకొక ముఖ్యమైన అంశం #ఎడిటింగ్ . కొద్దిగా షేక్ వస్తేనే ఎడిటర్స్ ఆ షాట్ తీసి పక్కన పెట్టేస్తారు. ఇందులో ఆల్మోస్ట్ కెమెరాకి కూడా అందని మూమెంట్స్ ఉన్నాయ్… అలాంటి మూమెంట్స్ కూడా..చూసే ఆడియన్ కళ్ళకి అందేలా ఎడిట్ చేశాడంటే …ఎడిటర్ కి ఎంత క్రియేటివిటీ ఉండాలి….
‘సినిమా థర్డ్ డైరెక్టర్ ఎడిటర్ ,ఎడిటర్ కి చాలా క్రియేటివిటీ ఉండాలి’ అని చెప్తుంటే కొందరు అన్నారు ‘ఎడిటర్ కి క్రియేటివిటీ ఏంటబ్బా’ అని…గూఢచారి చూసి ఎడిటర్‌కి ఉండాల్సిన క్రియేటివిటీ ఏంటో నేర్చుకోండి కొత్తగా వచ్చే ఎడిటర్స్ …
సినిమా 20 మినిట్స్ చూశాక ఎడిటింగ్ అదిరిపోయింది అనుకొంటే అప్పుడు గుర్తొచ్చింది … అరేయ్ Garry Bhg అన్న కదా ఎడిటింగ్ అని , అన్నా చాలా ప్రౌడ్ గా ఉంది…మీరు తెలుసు కాబట్టి ఇలా చెప్పట్లేను మమస్ఫూర్తిగానే చెప్తున్నాను . రియల్లీ అమేజింగ్ వర్క్ …
మ్యూజిక్ అండ్ మిగతా టెక్నీకల్ డిపార్ట్మెంట్స్ కూడా పరిమితిలో.. కంటెంట్ కి తగ్గట్టుగానే ఉన్నాయ్…..
స్పై ,వార్ ,రా, అనే పదాలు స్క్రిప్ట్ లో ఉంటె పాకిస్తానీ బార్డర్ కో ,ఆఫ్ఘనిస్థాన్ అంచులకో వెళ్లాల్సిన అవసరం లేదు మణికొండ పాడుబడ్డ బంగ్లాలలో కూడా తీసి… ఆ ఎట్మాస్పియర్ సృష్టించొచ్చు ….అందుకు కావాల్సింది క్రియేటివిటీ ,టెక్నీకల్ నాలెడ్జ్ …
గూఢచారి టీం కి ఈ రెండు ఉన్నాయ్…మున్ముందు ఇంకా అద్భుతాలు దైర్యంగా ఎక్సపెక్ట్ చేయొచ్చు..
– Balaji Prasad
Website: click here
Telegram channel: click
for more Updates do subscribe to the newsletter and also subscribe in youtube: Click here
Till then keep visiting our website
Telegram channel: Join Here
Instagram: Click here
Join in Facebook group: Click here
Like our page on Facebook: Click here
Subscribe our Youtube Channel: Click here