ఒక్క పొరపాటు నిండు జీవితాన్ని ఎలా…… ఈ సంఘటనే ఓ ఉదాహరణ

ఒక్క పొరపాటు నిండు జీవితాన్ని ఎలా…… ఈ సంఘటనే ఓ ఉదాహరణ

ఒక్క పొరపాటు నిండు జీవితాన్ని ఎలా…… ఈ సంఘటనే ఓ ఉదాహరణ:-

విజయవాడకు చెందిన డ్యాన్సర్‌ గాయత్రి డిసెంబర్ 19న తన ఇంటిలో ఆత్మహత్య చేసుకుంది. కాగా, పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. అయితే విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. డ్యాన్సర్ గాయత్రి ఆత్మహత్యకు కారణం వివాహేతర సంబంధమేనని ప్రాథమికంగా నిర్థారించారు.

తోటి డ్యాన్సర్‌త గాయత్రి ఈవెంట్ డ్యాన్సర్‌గా పని చేస్తుంటుంది. అయితే తన తోటి డ్యాన్సర్‌ బన్నీతో ఆమెకు పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసిందని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చాన్నాళ్లుగా వాళ్లిద్దరి మధ్య సంబంధం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా బన్నీతో దిగిన ఫోటోను గాయత్రి వాట్సాప్‌ స్టేటస్‌లో పెట్టుకోవడంతో బన్నీ భార్య నీలిమ గాయత్రి ఇంటికి వచ్చి గొడవపడిందని సమాచారం. 

అయితే నీలిమ వచ్చి వెళ్లిపోయిన కొద్దిసేపటికే గాయత్రి ఆత్మహత్యకు పాల్పడింది. ఆ సమయంలో గాయత్రి భర్త సతీష్ పిల్లలతో కలిసి బయటకు వెళ్లాడు. కాగా గాయత్రి మృతిపై కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సైతం అన్ని కోణాల్లోనూ దర్యాప్త చేస్తున్నట్లు తెలిపారు. గాయత్రితో గొడవ పడ్డ నీలిమా పరారీలో ఉందని ఆమె కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

AllEscort