కళ్ళతో గీసుకున్న నీ చిత్రాన్ని నా
చూపుల్లో బంధించి జ్ఞాపకపు
సంకెళ్లు వేసానేమో!!!
ఎదలోతుల్లో దాగిన జ్ఞాపకం
అలుపెరుగక అనుక్షణం
సవ్వడి చేసే నీ ఊసుల
తమకానికి నే బానిసయ్యాను
నిశీధి లో పూసిన పున్నమి లా
నిత్యం నీ తలపు వెలుగులు నను
తాకుతూనే ఉన్నాయ్…
ఎన్ని జన్మలు అయిన మరుపురాని
మది చెరపలేని ఆ తియ్యటి
జ్ఞాపకం నువ్వేనని…
మబ్బులు నిండిన మేఘాల కురుల
వెనుక తళుక్కున మెరుస్తున్న ఈ
మిణుగురులే సాక్ష్యం….❤️❤️
©Kavita Raghav
#కవి
Till then keep visiting our
website