అసలు పైరసీ ని ఆపగలమా? – Mana Updates

నేను ఫస్ట్ టైం పైరసీ experience చేసింది విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్నపుడు

నేను ఫస్ట్ టైం పైరసీ experience చేసింది విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్నపుడు, నేను వచ్చిన బస్సు లో “నిన్నే పెళ్లాడతా” vcr లో వేసాడు. అప్పటికి సినిమా ఇంకా థియేటర్స్ లో ఆడుతోంది. పొద్దున్నే బస్ దిగగానే ఆవేశంగా అన్నపూర్ణ స్టూడియోస్ కి కాల్ చేసి బస్సు నెంబర్ అన్నీ చెప్పా, అప్పట్లో వాళ్ళు పేపర్ యాడ్ ఒకటి ఇచ్చి నెంబర్ కూడా ఇచ్చారు ఎక్కడన్నా cassettes కనిపిస్తే call చేయమని. వాళ్ళు action తీసుకున్నారో లేదో నాకు తెలియదు. 

దాని తర్వాత 2001 లో ఇండస్ట్రీ కి వచ్చాక VCD పైరసీ, మా రూమ్ లో టీవీ vcd ప్లేయర్ ఉండేవి, అన్నీ pirated CDs, ఉదయ్ అనే ఫ్రెండ్ మాత్రం చాలా originals కొనేవాడు. చెన్నై నుంచి ఒకతను రెండు బ్యాగ్లు వేసుకుని ఒక అసిస్టెంట్ తో వచ్చేవాడు, హాలీవుడ్ నుంచి అన్ని ఇంటర్నేషనల్ సినిమాలు cd లు dvd లు ఉండేవి, ఏదో ఒక ఫ్రెండ్ రూమ్ కి పిలిచేవాళ్ళం అక్కడకి వచ్చి ఎవడికి కావాల్సినవి వాడు bulk గా కొనుక్కుని వెళ్లిపోయేవాళ్లు. సినిమా మీద ఇంటరెస్ట్ ఒక reason అయితే దేంట్లో నుండి కథ సీన్లు ఎత్తేసి వాడుకుందామా అనేది మరొక ముఖ్యమైన reason. ఏదైనా సినిమా హాలీవుడ్ లో సూపర్ హిట్ అయితే దాని కాపీలు కనీసం 50 ఉండేవి వీడియో లైబ్రరీల్లో. బయటకి ఒరిజినల్ బాక్స్ display. పోలీసులు raid చేయటం పట్టుకోవటం వాళ్ళు మళ్ళీ బయటకి వచ్చి same పని చేయటం. 
ఎప్పుడైతే ఇండియన్ ఇండస్ట్రీ మీద తెలుగు ఇండస్ట్రీ మీద పైరసీ ప్రభావం మొదలైందో ఇక అప్పుడు గగ్గోలు అలజడి. Word నుంచి సినిమా కథలు రాసుకునే ఫైనల్ డ్రాఫ్ట్ సినిమాలు ఎడిట్ చేసే software లు vfx software లు అన్నీ పైరేట్ చేసినవే ఉండేవి. Adobe ఫోటోషాప్ వాడు ఇండస్ట్రీ స్టూడియో ల మీద raid చేసి కేసులు పెట్టడం, ఫైన్ లు వేయటం అప్పుడు ఒరిజినల్ కొనటం మొదలుపెట్టారు. ఇప్పటికీ చాలా స్టూడియోస్ లో పైరేటెడ్ softwares వాడతారు. 
అసలు పైరసీ ని ఆపగలమా? Impossible అనిపిస్తుంది, దాంట్లో ఎన్ని డబ్బులు involve అయి ఉన్నాయి ప్లస్ వాళ్ళు ఎలా ఆపరేట్ చేస్తారు అనే ఒక ఆర్టికల్ చదివాక దీన్ని ఎవడేం చేయలేడు అనిపించింది. ఒకరోజు మెట్రో లో ట్రావెల్ చేస్తుంటే ఒకడు సాహో సినిమా పైరసీ కాపీ earphones కూడా పెట్టుకోకుండా చూసేస్తున్నాడు, ఆహా ఎంత ధైర్యం వీడికి అనిపించింది, చాయ్ కొట్ల దగ్గర కూర్చునేవాళ్ల దగ్గరనుంచి బంజారాహిల్స్ లో కోటీశ్వరులు కూడా పైరేటెడ్ copies చూస్తుంటే ఎవడేం చేయగలడు?
-camp Sasi ( Director) 

Leave a Reply

Your email address will not be published.

AllEscort