Connect with us

Hi, what are you looking for?

Latest

అందమైన సుందర నగరం విశాఖకు ఏమైంది?? – Parwada – Vizag

అందమైన సుందర నగరం విశాఖకు ఏమైంది??
విశాఖ రాంకీ పరిశ్రమలో భారీ ప్రమాదం.. 
 విశాఖపట్నంలోని రాంకీ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద శబ్దంతో పేలుడు సంభవించి అనంతరం మంటలు ఎగసిపడ్డాయి.
విశాఖపట్నం నగరాన్ని ఇండస్ట్రియల్ ప్రమాదాలు వెంటాడుతున్నాయి. నగరంలోని రాంకీ ఫార్మాసిటీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సోమవారం (జులై 13) రాత్రి సుమారు 11 గంటల సమయంలో పరిశ్రమ నుంచి భారీ పేలుడు శబ్దం వినిపించింది. అనంతరం మంటలు ఎగసిపడుతున్నాయి. ఒక్కసారిగా ఎగసిపడుతున్న మంటలను చూసి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పరిశ్రమ నుంచి 2, 3 కి.మీ. వరకు మంటలు కనిపిస్తున్నాయి.
పరిశ్రమ నుంచి పలుమార్లు పేలుడు శబ్దాలు వినిపించాయని స్థానికులు చెబుతున్నారు. పేలుళ్ల కారణంగా ఫైర్ ఇంజిన్ కూడా ఘటనా స్థలికి దూరంగా నిలిచిపోయినట్లు సమాచారం. విశాఖపట్నంలో ఎల్జీ పాలీమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీక్ ఘటన విషాదం నింపిన నేపథ్యంలో నగరవాసులు ఆందోళనకు గురవుతున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Website: click here 
Telegram channel: click 
for more Updates do subscribe to the newsletter and also subscribe in youtube: Click here

Till then keep visiting our website 
Telegram channel: Join Here
Instagram: Click here 
Join in Facebook group: Click here
Like our page on Facebook: Click here
Subscribe our Youtube Channel: Click here

Click to comment

Leave a Reply

Your email address will not be published.

You May Also Like

Advertisement